మా నాన్న సినిమాలు మానేస్తే బెటర్!

మా నాన్న సినిమాలు మానేస్తే బెటర్!

12-06-2018

మా నాన్న సినిమాలు మానేస్తే బెటర్!

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినిమాలు మానేసి కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తే బావుంటుందని ఆయన కుమార్తె ఐశ్వర్య అభిప్రాయపడ్డారు. ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన నటన ద్వారా ప్రేక్షకులను సంతోషపెడుతున్న రజనీ పూర్తిగా సినీ రంగంపైనే దృష్టిసారించడం తగదని అన్నారు. ఇప్పటికిప్పుడు రజనీ పూర్తిగా సినిమాలకు దూరం కావాలని తాను చెప్పడం లేదని, దశలవారీగా సినిమాలకు తగ్గించుకుని కుటుంబంతో ఎక్కువగా గడపాలని కోరుకుంటున్నానని చెప్పారు. సుఖదు:ఖాలను సమానంగా భరించాలని, సంతోషమొస్తే ఎక్కువగా పొంగిపోకూడదని, అలాగే దు:ఖం వస్తే కుంగిపోకూడదని రజనీ తరచూ చెప్పే హితోక్తి తనకు బాగా ఇష్టమని అన్నారు.