దేవసేన పెళ్లికి సిద్ధమౌతోందా?

దేవసేన పెళ్లికి సిద్ధమౌతోందా?

12-06-2018

దేవసేన పెళ్లికి సిద్ధమౌతోందా?

దేవసేన పెళ్లికి సిద్ధమౌతోందా? అవుననే అంటున్నాయి ఫిలిం వర్గాలు. భాగమతి తర్వాత అనుష్క కొత్త ప్రాజెక్టులు ఏవీ ఒప్పుకోలేదు. దాంతో ఈ ఏడాది ఆమె వివాహ బంధంలోకి ప్రవేశించనున్నారని వార్తలు వెలువడుతున్నాయి. అనుష్క తల్లిదండ్రులు తమ కుమార్తె కోసం వరుడిని వెతికే పనిలో ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం తరచూ ఆలయాలకు వెళ్లి త్వరగా పెళ్లి జరగాలని పూజలు చేస్తున్నారట. దీన్ని బట్టి చూస్తే అనుష్క పెళ్లి ఈ ఏడాది చివర్లో జరగొచ్చని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి.