ఆ హీరోయిన్ బ్యాగ్ ధరతో ఒక కారు కొనొచ్చు!

ఆ హీరోయిన్ బ్యాగ్ ధరతో ఒక కారు కొనొచ్చు!

14-06-2018

ఆ  హీరోయిన్ బ్యాగ్ ధరతో ఒక కారు కొనొచ్చు!

సెలబ్రిటీల లైఫ్‌స్టైల్‌ వేరు. ఒక సినీ ప్రముఖుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జిమ్‌, బ్యూటీ పార్లర్‌, ఎయిర్‌పోర్టు, ఈవెంట్‌ ఇలా వారు ఎక్కడికి వెళ్లినా ప్రత్యేకంగా తయారై వెళుతుంటారు. వాళ్లు ఎలాంటి దస్తులు వేసుకున్నారు? ఏ హ్యాండ్‌బ్యాగ్‌ వాడుతున్నారు? వంటి విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపుతుంటారు. తాజాగా గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా వాడుతున్న హ్యాండ్‌బ్యాగ్‌ ఒకటి సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిగ్‌ మారింది. ఇటీవల ప్రియాంక, ప్రముఖ హాలీవుడ్‌ నటుడు, గాయకుడు నిక్‌ జోనాస్‌తో కలిసి న్యూజెర్సీలో తన సోదరి పెళ్లి వేడుకకు వెళ్లింది. ఈ వేడుకకు ప్రియాంక ఓ అందమైన హ్యాండ్‌బ్యాగ్‌ తీసుకెళ్లింది. దాని ధర తెలిస్తే మాత్రం మనం షాకవ్వాల్సిందే. 

ఎందుకంటే ఆ బ్యాగ్‌ ధరతో మన భారత్‌లో ఓ చిన్న కారు కొనుక్కోవచ్చు. ఆ బ్యాగ్‌ ప్రముఖ ఇటాలియన్‌ బ్రాండ్‌ బొటేగా వెనెటాకు చెందినది. దాని ధర సుమారు 6,820 డాలర్లు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.4.6 లక్షలు. ఈ డబ్బుతో టాటా టియాగో, రెనాల్ట్‌ క్విడ్‌ వంటి కార్లు కొనుక్కోవచ్చు. మన మార్కెట్‌లో టియాగో కారు రూ.3.56 లక్షలు, రెనాల్ట్‌ క్విడ్‌ కారు రూ.3.9 లక్షలకు లభిస్తున్నాయి.