మరో వారసుడొచ్చాడు

మరో వారసుడొచ్చాడు

14-06-2018

మరో వారసుడొచ్చాడు

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ మరోసారి తండ్రి అయ్యాడు. ఎన్టీఆర్‌ భార్య ప్రణతి ఈ రోజు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. నా కుటుంబం మరింత పెద్దదైంది. మగ బిడ్డ అంటూ ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశారు. దీంతో అభిమానులు, స్నేహితులు సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఎన్టీఆర్‌ సోదరుడు కల్యాణ్‌రామ్‌ కూడా ట్విటర్‌ ద్వారా విషెస్‌ అందజేశారు. ఎన్టీఆర్‌, ప్రణతి దంపతులకు ఇప్పటికే ఓ కొడుకు (అభయ్‌రామ్‌) ఉన్న సంగతి తెలిసిందే.