మెహరీన్ కు అమెరికాలో చేదు అనుభవం!
Sailaja Reddy Alluddu

మెహరీన్ కు అమెరికాలో చేదు అనుభవం!

18-06-2018

మెహరీన్ కు అమెరికాలో చేదు అనుభవం!

నాని నటించిన కృష్ణ గాడీ వీరప్రేమ గాథ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన భామ మెహరీన్‌.  ఈ అమ్మడుకు అమెరికాలో చేదు అనుభవం ఎదురైనట్టు తెలుస్తుంది. టాలీవుడ్‌కి చెందిన కొందరు హీరోయిన్స్‌ చికాగో సెక్స్‌ రాకెట్‌లో ఇరుక్కోవడంతో అమెరికా పోలీసులు అక్కడికి వస్తున్న తెలుగు సెలబ్రిటీలను లోతుగా విచారిస్తున్నారట. ఈ క్రమంలో తన కుటుంబాన్ని కలవడానికి వెళ్లిన మెహరీన్‌ని కూడా ప్రశ్నించారట. మెహరీన్‌ అమెరికాలో ఉన్న తన కుటుంబ సభ్యులని కలవడానికి యూఎస్‌ వెళ్లింది. అక్కడి నుండి కెనడాలో స్నేహితులని కలిసేందుకు ఎయిర్‌పోర్టుగా వెళ్లగా, అదికారులు ఆమె టాలీవుడ్‌కి చెందిన హీరోయిన్‌ అని తెలిసి 30 నిమిషాల పాటు విచారించాటర. విచారణలో అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మెహరీన్‌ తన ఫ్యామిలీని కలిసేందుకు వచ్చానని అన్నారట. అయితే తనకి ఇబ్బంది కలిగించినందుకు అధికారులు క్షమాపణ చెప్పారని మెహరీన్‌ తెలిపారు. నిర్మాణ కిషన్‌ మోదుగుమూడి, అతని భార్య చంద్రకళ సాగించిన సెక్స్‌ రాకెట్‌ కారణంగా ఇప్పుడు ఏ తప్పు చేయని వారు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది.