బీజేపీ నుంచి పోటీచేస్తా

బీజేపీ నుంచి పోటీచేస్తా

07-07-2018

బీజేపీ నుంచి పోటీచేస్తా

రానున్న ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎంపీగా పోటీచేస్తానని వర్ధమాన సినీనటి భూక్యా రేష్మా రాథోడ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తమ స్వగ్రామం ఇల్లెందు మండలం ఉసిరికాయలపల్లి అని తెలిపారు. మణుగూరులో ప్రాథమిక విద్యను చదవి, కాకతీయ యూనిర్సిటీలో లా పూర్తి చేసినట్లు తెలిపారు. చదువుకునే రోజుల్లో షార్ట్‌ ఫిల్మ్స్‌లో నటించానని, ఈ క్రమంలో సినిమాల్లో నటించే అవకాశం వచ్చిందన్నారు. తమిళంలో ఒకటి, మలయాళంలో ఒక సినిమాలో నటించినట్లు తెలిపారు. రాజకీయాలపై ఉన్న ఆసక్తితో గత ఏప్రిల్‌ 14న బీజేపీలో చేరినట్లు రేష్మా తెలిపారు.