పెళ్లి పీటలెక్కనున్న రజనీకాంత్ కూతురు

పెళ్లి పీటలెక్కనున్న రజనీకాంత్ కూతురు

07-07-2018

పెళ్లి పీటలెక్కనున్న రజనీకాంత్ కూతురు

aసూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించిన తాజా చిత్రం కాలా. పారంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హుమా ఖురేషీ కథానాయకిగా నటించగా తలైవా భార్యగా ఈశ్వరీ రావు నటించారు. రజనీ కూతురి పాత్రలో సింగపూర్‌కి చెందిన నటి సుకన్య నటించారు. ఆమె పాత్రకి విశేష ఆదరణ లభించింది. ప్రస్తుతం తమిళంతో పాటు పలు ఆఫర్స్‌ ఆమెని పలుకరిస్తున్నాయి. అయితే ఈ నెల 14న సింగపూర్‌లో తన క్లాస్‌మేట్‌ విక్రమ్‌ అనే పారిశ్రామికవేత్తని వివాహం చేసుకోనుంది సుకన్య. ఆమె పూర్వీకులు నివసించిన దిండుగల్‌లో రిసెప్షన్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్న సుకన్య ఇటీవల రజనీకాంత్‌ని స్వయంగా కలిసి తన పెళ్లికి ఆహ్వానించిందని కోలీవుడ్‌ టాక్‌.