'మనం సైతం'కు కృష్ణ దంపతుల విరాళం

'మనం సైతం'కు కృష్ణ దంపతుల విరాళం

09-07-2018

'మనం సైతం'కు కృష్ణ దంపతుల విరాళం

మనం సైతం సేవా సంస్థలో నేనున్నాంటూ ముందుకొచ్చారు సూపర్‌స్టార్‌ కృష్ణ ఆయన సతీమణి విజయనిర్మల. వీరిరువురూ సంస్థకు విరాళం అందజేశారు. చెరో రూ.2లక్షలను మనం సైతం కు అందజేశారు. సూపర్‌స్టార్‌ దంపతులను మనం సైతం సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా ఐదుగురు ఆపన్నులకు మనం సైతం ఆర్థికసాయం అందించింది. వీరిలో కొందరికీ అనారోగ్య చికిత్సకు, మరికొందరు చదువులకు ఆర్థికసహాయం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణ, విజయనిర్మల మాట్లాడారు. కాదంబరి కిరణ్‌ మనం సైతం తో మంచి సేవా కార్యక్రమం చేస్తున్నారన్నారు. నటుడిగా కొనసాగుతూ సేవా కార్యక్రమాల్లో భాగమవ్వటం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో సభ్యులు బందరు బాబ్జీ, వల్లభనేని అనిల్‌, వినోద్‌బాల, హాస్యనటుడు రచ్చ రవి తదితరులు పాల్గొన్నారు.