కత్తిమహేశ్‌పై నగర బహిష్కరణ వేటు

కత్తిమహేశ్‌పై నగర బహిష్కరణ వేటు

09-07-2018

కత్తిమహేశ్‌పై నగర బహిష్కరణ వేటు

 గత కొంతకాలంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై హైదరాబాద్‌ పోలీసులు నగర బహిష్కరణ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పోలీసుల అనుమతి లేకుండా హైదరాబాద్‌ నగరానికి రాకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయన్ని అదుపులోకి తీసుకున్న హైదరాబాద్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు ఆంధ్రప్రదేశ్‌ పోలీసులకు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు ఆయన్ని స్వస్థలమైన చిత్తూరు జిల్లాకు తరలించారు. వివాదాస్పద వ్యాఖ్యలు ప్రసారం చేసిన ఓ టీవీచానల్‌కు నోటీసులిచ్చారు. అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లను అప్రమత్తం చేశారు.