ఆమె సినిమాలకు దూరం కావడం లేదు

ఆమె సినిమాలకు దూరం కావడం లేదు

10-07-2018

ఆమె సినిమాలకు దూరం కావడం లేదు

త్వరలోనే సమంత చిత్రసీమకు గుడ్‌బై చెప్పబోతోందని, చేతిలో ఉన్న సినిమాలన్నీ చేసేశాక, ఇక పూర్తిగా ఇంటికే పరిమితం కానున్నదని వార్తలొచ్చాయి. రంగస్థలం తరవాత కొత్త సినిమాలపై సంతకాలు చేయడానికి సమంత అంతగా ఇష్టపడడం లేదు. దాంతో ఈ వార్తలు నిజమేనేమో అనుకున్నారంతా. కానీ, అలాంటిదేం లేదని తెలిపోయింది. సమంత సినిమాలకూ దూరం కావడం లేదు. ఈ విషయంలో నాగచైతన్య క్లారిటీ ఇచ్చేశాడు. సమంత సినిమాలకు దూరం అవుతుందన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. తను ఇక మీదటా సినిమాలు చేస్తుంది. కాకపోతే మధ్యమధ్యలో కాస్త విరామం తీసుకుంటుందంతే అన్నాడు చైతూ. ప్రస్తుతం యు టైర్న్‌తో బిజీగా ఉంది సమంత. ఆ తరవాత శివ నిర్వాణ దర్శకత్వం వహించే చిత్రంలో చైతన్యతో కలసి నటించబోతోంది.