లతా రజనీకాంత్ కు సుప్రీం షాక్
Sailaja Reddy Alluddu

లతా రజనీకాంత్ కు సుప్రీం షాక్

11-07-2018

లతా రజనీకాంత్ కు సుప్రీం షాక్

వాణిజ్య ప్రకటనలసంస్థ దాఖలు చేసిన కేసులో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సతీమణి లతా రజనీకాంత్‌కు సుప్రీంలో మరోసారి చుక్కెదురైంది. కర్నాటక హైకోర్టు ఆదేశాలను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. నేర విచారణను ఎదుర్కోవాల్సిందేనని సృష్టం చేసింది. కొచ్చాడియన్‌ సినిమా నిర్మాణ సంస్థకు లత పూచీకత్తు మేరకు 10 కోట్ల రూపాయలు రుణంగా ఇచ్చామని ఏడీ బ్యూరో అడ్వర్జయిజ్‌ సంస్థ ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన ధర్మానం బకాయి మొత్తాన్ని చెల్లించాలని చెప్పింది. కోర్టు ఆదేశాల ప్రకారం రూ.6.2 కోట్లు చెల్లించకపోవడంపై జులై 3న సుప్రీం ధర్మాసనం ఆమెను ప్రశ్నించిన విషయం తెలిసిందే.