అనుష్క శర్మకు అరుదైన గౌరవం

అనుష్క శర్మకు అరుదైన గౌరవం

11-07-2018

అనుష్క శర్మకు అరుదైన గౌరవం

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శర్మకు అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ వ్యాక్స్‌ మ్యూజియంలో ఓప్రా విన్‌ఫ్రే, పోర్చుగల్‌ పుట్‌బాల్‌ ప్లేయర్‌ క్రిస్టియానో రొనాల్డో, లెవిస్‌ హామిల్టన్‌ లాంటి అంతర్జాతీయ సెలబ్రిటీల మధ్య ఆమె వైనపు విగ్రహం కొలువు తీరనుంది. అయితే గతంలో ఇక్కడ ఉన్న మైనపు బొమ్మలకు, అనుష్క మైనపు విగ్రహానికి ఓ వ్యత్యాసం ఉందట. ఈ మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో మాట్లాడే అనుష్క మైనపు బొమ్మను ఏర్పాటు చేయనున్నారు.

గతంలో ఇక్కడ కొలువుతీరిన మైనపు బొమ్మలతో ఆయా సెలబ్రిటీల అభిమానులు సెల్ఫీలు, ఫొటోలు దిగుతున్నారు. అయితే అనుష్క ఫ్యాన్స్‌ మాత్రమ తమ అభిమాన సెలబ్రిటీతో మాట్లాడుకునే అవకాశం కల్పించారు. అనుష్క మైనపు బొమ్మకు వద్ద ఏర్పాటు చేసిన ఫోన్‌ను పట్టుకుంటే అభిమానులను ఆప్యాయంగా పలకరిస్తుంది. ప్రపంచంలో మరే ఇతర సెలబ్రిటీకి దక్కని అరుదైన గౌరవం తమ అభిమాన నటికి సింగపూర్‌లో దక్కిందన్న విషయం తెలుసుకున్న ఈ      ముద్దుగుమ్మ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.