రకుల్ కు గోల్డెన్ ఛాన్స్?
Sailaja Reddy Alluddu

రకుల్ కు గోల్డెన్ ఛాన్స్?

12-07-2018

రకుల్ కు గోల్డెన్ ఛాన్స్?

ఎన్టీఆర్‌ బయోపిక్‌లో నటించే అదృష్టం రకుల్‌ప్రీత్‌ని వరించినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ నటిస్తూ, నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న ఈ బయోపిక్‌ను క్రిష్‌ తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్‌ నటిస్తుండడం తెలిసిందే. అలాగే ఈ చిత్రంలోని ప్రతి చిన్న పాత్ర కోసం సైతం ప్రముఖులను ఎంపిక చేస్తున్నారు. కెరీర్‌ బిగినింగ్‌లో ఎన్టీఆర్‌తో పలు చిత్రాలు రూపొందించిన ప్రముఖ దర్శకుడు బి.ఎ.సుబ్బారావు పాత్ర కోసం నరేష్‌ను తీసుకున్నారు. బాలయ్య-నరేష్‌ కాంబినేషన్‌లో ప్రస్తుతం కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. స్పైడర్‌ అనంతరం తెలుగులో కొత్త సినిమాకు సంతకం చేయని రకుల్‌ సవ్యసాచిలో నాగచైతన్యతో ఐటం సాంగ్‌ చేస్తోంది. ఇప్పుడు ఎన్టీఆర్‌ బయోపిక్‌లో నటించే అవకాశం రావడం ఆమె కెరీర్‌కు చాలా హెల్ప్‌ అవుతుందని చెప్పడం అతిశయోక్తి కాదు.