కత్రినాకు చేదు అనుభవం
Sailaja Reddy Alluddu

కత్రినాకు చేదు అనుభవం

12-07-2018

కత్రినాకు చేదు అనుభవం

బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌ తన దురుసు ప్రవర్తన కారణంగా చేదు అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దబాంగ్‌ టూర్‌లో భాగంగా ప్రస్తుతం వాంకోవర్‌లో ఉన్న కత్రినా, వేదిక వద్దకు చేరుకునే క్రమంలో సెల్పీల కోసం అభిమానులు చుట్టుముట్టారు. తమతో సెల్పీలు దిగాల్సిందిగా కోరడంతో కొందరికి అవకాశం ఇచ్చారు. కాసేపటి తర్వాత, మీరిలా చేయకండి. నేను అలసిపోయాను అని తెలుసు కదా. నేను ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయంటూ కత్రినా కాస్త గట్టిగానే అభిమానులను మందలించారు. కత్రినా వ్యాఖ్యలకు బాధపడిన ఓ మహిళ, మీ ప్రవర్తను మార్చుకోండి. పెద్ద హీరోయిన్‌ అని చెప్పుకుంటారు కదా. అభిమానులు ముచ్చటపడి దగ్గరికి వస్తే ఇలా కసురుకుంటారా అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు. దీంతో కత్రినా కూడా ఆమెతో గొడవకు సిద్ధమైపోయారు. కత్రినా సెక్యూరిటీ సిబ్బంది కలుగజేసుకు ఆమెను వారించారు. అయినప్పటికీ ఆ మహిళ ఊరుకోకుండా మీ కోసం ఎవరూ రాలేదే. మేమంతా సల్మాన్‌ కోసం వచ్చాం. కేవలం ఆయన కోసమే అంటూ కత్రినాను హేళన చేశారు.