మెగాస్టార్ సరసన అనుష్క ?

మెగాస్టార్ సరసన అనుష్క ?

09-08-2018

మెగాస్టార్ సరసన అనుష్క ?

అనుష్క టాలీవుడ్‌లో ప్రత్యేకమైన క్రేజ్‌ తెచ్చుకున్న హీరోయిన్‌. ఓ వైపు గ్లామర్‌ హీరోయిన్‌గా స్టార్‌ హీరోలతో సినిమాలు చేస్తూ మరోవైపు లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలతో అదే స్టార్‌ హీరోలకు బాక్సాఫీస్‌ వద్ద పోటీనిచ్చింది. తాజాగా ఈమె మెగాస్టార్‌ సరసన ఛాన్స్‌ కొట్టేసినట్లు తెలుస్తోంది. దర్శకుడు కొరటాల శివ మెగాస్టార్‌ చిరంజీవితో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. మంచి సోషల్‌ మెసేజ్‌తో తెరెక్కనున్న ఈ చిత్రంలో చిరు రైతు పాత్రలో నటించనున్నారని సమచారం. ఇక ఈ చిత్రంలో చిరంజీవి సరసన నటించే హీరోయిన్‌ కోసం వెతికే పనిలో ఉన్నాడట కొరటాల. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం, కొరటాల శివ తన తొలి చిత్రం మిర్చి లో హీరోయిన్‌గా నటించిన అనుష్కను మెగాస్టార్‌తో చేయబోయే సినిమా కోసం హీరోయిన్‌గా తీసుకోనున్నారు. ఇప్పటికే అనుష్క కూడా నటించడానికి అంగీకరించిందని తెలుస్తోంది. అయితే ఈ వార్తకు సంబంధించిన అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభం కాబోతోందని టాక్‌.