అతిలోక సుందరిగా రకుల్ రెడీ

అతిలోక సుందరిగా రకుల్ రెడీ

10-08-2018

అతిలోక సుందరిగా రకుల్  రెడీ

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీ రామారావు జీవిత కథ ఆధారంగా నిర్మిస్తున్న బయోపిక్‌ ఎన్టీఆర్‌ చిత్రానికి దర్శకుడు క్రిష్‌. జులై 5 నుంచి షూటింగ్‌ మొదలు పెట్టి మొదటి షెడ్యూల్‌ పూర్తిచేసుకుంది. ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రల కోసం ఇప్పటికే విద్యాబాలన్‌, రానా, సచిన్‌ కెడెకర్‌, మోహన్‌బాబు, సుమంత్‌ తదితరులు నటిస్తున్నారు. క్రేజీ హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌ కూడా ఈ చిత్రంలో అతిలోక సుందరి శ్రీదేవి పాత్రలో కన్పించబోతోంది. ఈ విషయాన్ని చిత్ర సహనిర్మాత విష్ణు అధికారికంగా ప్రకటించారు. అయితే డేట్స్‌ ఇంకా కుదరలేదని, త్వరలోనే ఆమె యూనిట్‌తో పాల్గొంటుందని అన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుగా ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సాయి కొర్రపాటి, విష్ణు సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.