ఏడాదికి రూ.60 కోట్లు

ఏడాదికి రూ.60 కోట్లు

10-08-2018

ఏడాదికి రూ.60 కోట్లు

ఇటీవల కాలంలో స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంకా చోప్రా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. సోషల్‌ మీడియాలో రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. తాజాగా మళ్లీ వార్తల్లో కెక్కారామె. గత ఏడాది తన సంపాదనకు సంబంధించి అందర్నీ ఆచర్యపరిచారు. తాజాగా బాలీవుడ్‌ వర్గాల సమాచారం ప్రకారం, 2017లో ప్రియాంకా చోప్రా ఆదాయం రూ.60 కోట్లు అని బాలీవుడ్‌, దక్షిణ చిత్ర పరిశ్రమల హీరోయిన్లు అందరికంటే ఎక్కువ మొత్తం సంపాదించిన హీరోయిన్‌గా రికార్డు సృష్టించారు. అమెరికన్‌ టివిషో క్యాంటికో, అనేక ఇతర యాడ్స్‌లో నటించటం కారణంగా ప్రియాంక చోప్రా ఇంత పెద్దమొత్తాన్ని సంపాదించిందని అంటున్నారు.