సెప్టెంబర్ లో సైమా

సెప్టెంబర్ లో సైమా

10-08-2018

సెప్టెంబర్ లో సైమా

7వ సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) సెప్టెంబర్‌లో జరగనుంది. దుబాయ్‌లో జరగబోయే ఈ ఈవెంట్‌ కోసం ఇప్పట్నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు. సైమా గురించి ప్రెస్‌మీట్‌ జరగనుంది. ఇదే ప్రెస్‌మీట్‌లోనే షార్ట్‌ ఫిల్మ్‌ అవార్డులు కూడా ప్రకటించనున్నారు. సైమాకు ఎంతోమంది తారలు దిగిరానున్నారు. రెడ్‌ కార్పెట్‌పై చాలామంది స్టార్స్‌ తళుక్కుమనబోతున్నారు. 24 శాఖల్లో వాళ్లు వాళ్లుచేసిన కృషి, టాలెంట్‌ను గుర్తించి అవార్డులు అందజేయనున్నారు. సైమా గత ఎడిషన్స్‌ దుబాయ్‌, షార్జా మలేషియా, దుబాయ్‌, సింగపూర్‌, అబుదాబిల్లో జరిగాయి. ఇక ఇప్పుడు ఏడో ఎడిషన్‌ మరోసారి దుబాయ్‌లోనే జరగనుంది. ప్రముఖ ఫ్యాషన్‌ రిటైల్‌ స్టోర్‌, ఫ్యాంటా లూన్స్‌ సైమాకు టైటిల్‌ స్పాన్సర్‌గా ఉండబోతుంది. ఈ భారీ వేడుకను హిమాలయ ఫేస్‌వాష్‌ సమర్పించనుంది.