అమెరికా చుట్టొచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ

అమెరికా చుట్టొచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ

06-09-2018

అమెరికా చుట్టొచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ

రవితేజ మూడు పాత్రలు పోషించిన చిత్రం అమర్‌ అక్బర్‌ ఆంటోనీ. ఇలియానా కథానాయిక. శ్రీనువైట్ల దర్శకుడు. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవల అమెరికాలో కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. దాంతో టాకీ మొత్తం పూర్తయింది. అక్టోబరు 5న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. ఈ సందర్భంగా నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ మాట్లాడుతూ ఇటీవలే ఫస్ట్‌లుక్‌ విడుదల చేశాం. రవితేజ గెటప్పులకు మంచి స్పందన వస్తోంది. రవితేజ- శ్రీనువైట్లది విజయవంతమైన జోడీ. వాళ్ల నుంచి ఆశించే వినోదం ఇందులో పుష్కలంగా ఉంటుంది. సునీల్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. కథాబలం ఉన్న చిత్రమిది. సాంకేతిక హంగులూ ఆకట్టుకుంటాయి. ఈ నెలలోనే పాటల చిత్రీకరణ పూర్తి చేస్తామన్నారు. సంగీతం : తమన్‌.