కపిల్ దేవ్ బయోపిక్ లో బన్నీ ?

కపిల్ దేవ్ బయోపిక్ లో బన్నీ ?

08-09-2018

కపిల్ దేవ్ బయోపిక్ లో బన్నీ ?

భారత క్రికెట్‌ మాజీ సారథి కపిల్‌దేవ్‌ జీవిత కథ ఆధారంగా 83 పేరుతో బాలీవుడ్‌ లో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. కబీర్‌ఖాన్‌ దర్శకుడు. కపిల్‌దేవ్‌ పాత్రలో రణ్‌వీర్‌సింగ్‌ నటిస్తున్నారు. కపిల్‌దేవ్‌ సారథ్యంలోని భారతజట్టు 1983లో ప్రపంచకప్‌ను గెలుచుకొని తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. ఈ అపూర్వ ఘట్టం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ బయోపిక్‌లో అప్పటి జట్టులో కీలక సభ్యుడైన కృష్ణమచారి శ్రీకాంత్‌ పాత్రలో అల్లు అర్జున్‌ నటించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. చిత్రబృందం బన్నీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమచారం. అల్లు అర్జున్‌ ఇప్పటివకు బాలీవుడ్‌ చిత్రంలో నటించలేదు. అయితే ఆయనకు హిందీ చిత్రసీమతో సత్సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో కపిల్‌దేవ్‌ బయోపిక్‌లో బన్నీ నటిస్తాడనే వార్తలకు బలం చేకూరుతున్నది. అయితే అధికారిక ప్రకటన వస్తేనేగాని ఈ విషక్ష్మీం నిజమెంతో తెలియదని ముంబయి సినీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.