మాజీ ప్రపంచ సుందరికి మరో పురస్కారం

మాజీ ప్రపంచ సుందరికి మరో పురస్కారం

08-09-2018

మాజీ ప్రపంచ సుందరికి మరో పురస్కారం

అందచందాలతోనే కాదు, అద్భుత నటనతోను ప్రేక్షకజన హృదయాలను గెలుచుకున్న బాలీవుడ్‌ నటి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌ను మరో అంతర్జాతీయ అవార్డు వరించింది. టివీ, సినిమా రంగాల్లో అసాధారణ ప్రతిభ చూపిన మహిళలకు మెర్ల్‌ స్ట్రీప్‌ గౌరవార్థం ఇచ్చే తొలి అవార్డుకు ఐశ్వర్యను ఎంపిక చేశారు. ఈ అవార్డును వాషింగ్టన్‌లో ప్రదానం చేస్తున్నట్లు విప్ట్‌ ఇండియా (ఉమెన్‌ ఇన్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌) సంస్థ ప్రకటించింది.  మూడు ఆస్కార్‌ అవార్డులను గెలుచుకొని ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన 69 ఏళ్ల అమెరికా నటి మెర్ల్‌ స్ట్రీప్‌ గౌరవార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. వినోద రంగంలో విశిష్ట సేవలు అందిస్తూ మేటినటిగా రాణిస్తున్న ఐశ్వర్య కీర్తికిరీటంలో తాజాగా విఫ్ట్‌ అవార్డు చేరింది.