ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు ఫస్ట్ లుక్ విడుదల

ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు ఫస్ట్ లుక్ విడుదల

12-09-2018

ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు ఫస్ట్ లుక్ విడుదల

మాజీ ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు నిజ జీవిత కథ ఆధారంగా ఎన్టీయార్‌ బయోపిక్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్‌ క్రిష్‌ రూపొందిస్తున్న ఈ సినిమాలో కథానయాకుడైన ఎన్టీయార్‌ పాత్రలో నందమూరి బాలకృష్ణ కనిపించనున్నారు. ఎన్టీయార్‌ భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ నటిస్తోంది. ఏఎన్నారైగా సుమంత్‌ కనిపించనున్నారు. ఎన్టీయార్‌ అల్లుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  పాత్రలో యంగ్‌ హీరో దగ్గుబాటి రానా నటిస్తున్నాడు. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమాలోని రానా లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. దూరదృష్టి కలిగిన నాయకుడిగా పాత్రలో రానా అంటూ ఈ లుక్‌ను విడుదల చేశారు. అలాగే ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.