రివ్యూ : ఆత్మాభిమానం గల 'శైలజ రెడ్డి అల్లుడు'

రివ్యూ : ఆత్మాభిమానం గల 'శైలజ రెడ్డి అల్లుడు'

13-09-2018

రివ్యూ : ఆత్మాభిమానం గల 'శైలజ రెడ్డి అల్లుడు'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ 3/5 

బ్యానర్ : సితార ఎంటర్టైన్మెంట్స్.
నటీనటులు : అక్కినేని నాగ చైతన్య, అను ఎమ్మాన్యుయెల్, రమ్య కృష్ణ, వెన్నెల కిశోర్
నరేష్, మురళి శర్మ, రఘు బాబు, ప్రిథ్వి రాజ్, మరియు శరణ్య ప్రదీప్ తది తరులు నటించారు.

సినిమాటోగ్రఫీ:నిజార్ షఫీ, ఎడిటర్ :కోటగిరి వెంకటేశ్వరరావు
మ్యూజిక్ :గోపిసుందర్, పాటలు:సిరివెన్నెల సీత రామ శాస్ట్రీ,  కృష్ణ కాంత్, కాసర్ల శ్యామ్, శ్రీ మణి
సమర్పణ : ఎస్ రాధా కృష్ణ, నిర్మాతలు: ఎస్ నాగ వంశి, పి డి వి ప్రసాద్
కథ,మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : మారుతీ దాసరి 

విడుదల తేదీ : 13.09.2018

నాగ చైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా మారుతీ తెరకెక్కించిన చిత్రం శైలజారెడ్డి అల్లుడు. యస్ రాధా కృష్ణ సమర్పణలో, యస్ నాగ వంశి, పి డి వి ప్రసాద్ నిర్మాతలుగా రూపొందించిన ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా ఈరోజు ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ:

రిచ్ బిజినెస్ మ్యాన్ రావు (మురళి శర్మ) కొడుకైన చైతన్య(నాగ చైతన్య) తండ్రి బిజినెస్ లు చూసుకుంటూ ఉంటాడు. డబ్బున్న పొగరు, ఈగోయిస్ట్ గా ఉండే చైతన్య మొదటి చూపులోనే ప్రేమించిన అను (అను ఎమ్మాన్యుయెల్) తో నిశ్చితార్ధం చేస్తాడు. కానీ ఆమెకు వున్నా ఇగో కారణంగా ప్రేమ గురించి  చైతుకి చెప్పదు. ఆ క్రమంలో చైతు అనును మార్చి.. తన ప్రేమను చెప్పి.. ఇద్దరు ఒక్కటవుతారు. చైతన్య తండ్రి రావుకి తనలాగే అను కూడా ఇగోయిస్టు పర్సన్ అవ్వడం నచ్చుతుంది. దాంతో వారిద్దరి పెళ్లికి ఒప్పుకుంటాడు. అనుకోకుండానే ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా జరిపిస్తాడు. అయితే ఈవిషయం అను తల్లి శైలజారెడ్డి కి(రమ్యకృష్ణ) తెలియనివ్వకుండా జరుగుతుంది.

వూరి పెద్ద అయిన శైలజారెడ్డి  అనుకు వేరే అబ్బాయితో పెళ్లి చేయాలనుకుంటుంది. శైలజారెడ్డి కూడా పెద్ద ఇగోయిస్టు పర్సన్ కావడంతో.. ఇక చేసేది ఏమిలేక.. ఎలాగైనా శైలజారెడ్డి ని ఒప్పించాలని చైతన్య ఆమె ఇంటికి వస్తాడు. మరి చైతన్య ఆమెను ఒప్పించాడా ? చైతన్య అను పెళ్లి చేసుకుంటారా ? చేసుకుంటే ఆ ప్రాసెస్ లో వాళ్ళు ఎదురుకున్న పరిస్థితులు ఏమిటి ? అనేది మిగితా కథ .ఆమె శైలజా రెడ్డి కూతురు చెప్పాపెట్టకుండా పెళ్లిచేసుకోవడం తెలిసి ఆమె మనుషులు అనుని తీసుకెళ్తారు. అయితే ఆ విషయాన్ని శైలజా రెడ్డి దగ్గర దాచేస్తారు. శైలజా, అనుల మధ్య చిన్న విషయంలో గొడవై వారిద్దరు మాట్లాడరు అది తెలుసుకుని చైతన్య ఆ తల్లి కూతుళ్లతో పాటుగా తన ప్రేమను ఎలా గెలిచాడన్నది సినిమా కథ.

ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్:

చైతన్య పాత్రలో నాగ చైతన్య ఎప్పటిలానే ఎనర్జిటిక్ నటనతో ఆకట్టుకున్నాడు. సినిమాలో చైతన్య లుక్స్ బాగున్నాయి. ఇక హీరోయిన్ గా అను ఎమ్మాన్యుయెల్ ఇంప్రెస్ చేసింది. శైలజారెడ్డి రోల్ పోశించిన రమ్యకృష్ణ తన పాత్రకు తగినట్టుగా చేసింది. నరేష్, వెన్నెల కిశోర్, పృధ్వి నటన ఆకట్టుకుంది.సినిమాకు బలం నాగ చైతన్య ప్రాత చైతన్య పాత్ర లో బాగా ఆకట్టుకున్నాడు. డిఫ్రెంట్ బాడీ లాంగ్వేజ్ తో డిఫరెంట్ లుక్ తో చాలా కొత్తగా కనిపించాడు. సినిమా అంత ఫుల్ యాక్టీవ్ గా కనిపించాడు. ఇక ఇగో వున్న అను పాత్రలో అను బాగా నటించింది. శైలజారెడ్డి పాత్రలో నటించిన రమ్య కృష్ణ ఎప్పటిలాగే తన పాత్రకు పూర్తిగా న్యాయం చేసింది. మురళి శర్మ పాత్ర కూడా సినిమాకు హైలైట్ గా నిలిచింది. నిజమైన ఇగోయిస్టు పర్సన్ ఎలావుంటాడో ఈ సినిమాలో ఆయనను చుస్తే అలాగే అనిపిస్తుంది. ఇక  కమెడియన్ వెన్నెల కిశోర్ చాలా చోట్ల నవ్వించాడు. దర్శకుడు మారుతీ మనుషుల మధ్య ఇగో లేకుండా ఉంటే ఎంత బాగుంటుంది అనే కథను బాగానే తెరకెక్కించాడు. సెకండ్ హాఫ్ లో తన పట్టు చూపించాడు. ఆయన రాసుకున్న డైలాగ్స్ బాగున్నాయి.

సాంకేతిక వర్గం పనితీరు:

మనిషికి ఇగో ఎక్కువతే ఎలాంటి సమస్యలు వస్తాయో అనే పాయింట్ తో  మారుతీ రాసుకున్న ఈ కథ దాన్ని పూర్తి స్థాయిలో తెర మీదకు తీసుకరాలేకపోయాడు అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ చాలా చోట్ల బోర్ కొట్టించాడు. హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్ తో ఇంకా బాగా ఎంటర్టైన్ చేసే అవకాశం వున్నా దాన్ని ఉపయోగించుకోలేదు. ఇక నిజార్ షఫీ అందించిన ఛాయా గ్రహణం సినిమాకు హైలైట్ గా నిలిచింది. ప్రతి ఫ్రేమ్ ను చాల రిచ్ గా చూపెట్టారు. గోపిసుందర్ అందించిన సంగీతం పర్వాలేదు. సిట్యువేషనల్ సాంగ్ శైలజారెడ్డి అల్లుడు చూడే సాంగ్ వినడానికి బాగుంది. కోటగిరి వెంకటేశ్వరరావు అందించిన ఎడిటింగ్ బాగుంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

విశ్లేషణ:

మారుతి సినిమాలు కథలు రొటీన్ గా అనిపించినా కథనం చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. భలే భలే మగాడివోయ్, మహానుభావుడు అలానే అనిపిస్తాయి. అయితే శైలజా రెడ్డి అల్లుడు మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. మారుతి తన మార్క్ మిస్సయ్యాడని అనిపిస్తుంది. మొదటి భాగం సక్సెస్ అయిన మారుతి సెకండ్ హాఫ్ మరీ రొటీన్ గా కథనం నడిపించాడనిపిస్తుంది. ఒకానొక సందర్భంలో బోర్ కూడా కొట్టించేస్తుంది. తల్లి, కూతుళ్లు మాట్లాడని సందర్భంలో హీరో వారి చేత మాట్లాడించే సీన్స్ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. రమ్యకృష్ణ పాత్ర బాగుంది. ఆమెను ఇంకా బాగా వాడుకోవచ్చు. మెయిన్ హీరోయిన్ కన్నా రమ్యకృష్ణ పాత్ర ఇంప్రెస్ చేస్తుంది. హీరోయిన్ క్యారక్టరైజేషన్ విషయంలో దర్శకుడు తడబడ్డాడని చెప్పొచ్చు. తాను చెప్పదలచుకున్న పాయింట్ కామెడీ రూపంలో చెప్పే మారుతి శైలజా రెడ్డి అల్లుడు విషయంలో లాజిక్స్ మిస్సయ్యాడని చెప్పొచ్చు. ఓవరల్ గా మొదటి భాగం బాగున్నా సెకండ్ హాఫ్ మాత్రం ఇబ్బంది పెట్టేస్తుంది.

తీర్పు :

ఇగో కాన్సెప్ట్ తో.. నాగ చైతన్య, అను ఇమ్మాన్యుయేల్ హీరో హీరోయిన్లగా మారుతీ దర్శకత్వంలో వచ్చిన ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రం నటీనటుల పరంగా సాంకేతిక నిపుణుల పరంగా పర్వాలేదనిపించుకుంటుంది. ముఖ్యంగా నాగ చైతన్య నటన మరియు లుక్స్ పరంగా ఆకట్టుకున్నాడు. సినిమాలో ప్రధానంగా కామెడీ బలం అవ్వగా.. రొటీన్ గా సాగే సన్నివేశాలు, బోరింగ్ ట్రీట్మెంట్ తో సాగే కథనం సినిమాకు మైనస్ గా నిలిస్తాయి. మొత్తం మీద ‘శైలజారెడ్డి అల్లుడు’ కొంతవరకు బాగానే ప్రేక్షుకులను ఎంటర్‌టైన్ చేస్తుంది. మరి అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.