అమెరికా షెడ్యూల్ పూర్తి చేస్తున్న మహర్షి

అమెరికా షెడ్యూల్ పూర్తి చేస్తున్న మహర్షి

08-11-2018

అమెరికా షెడ్యూల్ పూర్తి చేస్తున్న మహర్షి

గత రెండు నెలలుగా అమెరికాలోని న్యూయార్క్‌లో మహేష్‌బాబు మహర్షి చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకుంటుంది. సినిమాలోని కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో తెరకెక్కించారు. కాగా, ఇటీవలే ఈ షెడ్యూల్‌కి ప్యాకప్‌ చేప్పేశారు. ప్రస్తుతం ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ పనిలో ఉంది. ఇటీవలే రిలీజైన టీజర్‌ తరువాత, కంఫ్లీట్‌ కాన్సంట్రేషన్‌ షూటింగ్‌ పైనే పెట్టిన ఫిల్మ్‌ మేకర్స్‌, త్వరలో సినిమా ముగింపు దశకు తీసుకురాబోతున్నారు. అల్లరి నరేష్‌ ఇంట్రెస్టింగ్‌ రోల్‌ ప్లే చేస్తున్న ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ త్వరలో ప్రారంభం కానుంది. మహేష్‌ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ కంపోజ్‌ చేస్తున్నాడు. దిల్‌ రాజు, పివిపి ప్రసాద్‌, అశ్వినిదత్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వంశీ పైడిపల్లి ఈ సినిమాకి దర్శకుడు.