విశాల్ కు జోడీగా మరోసారి మిల్కీ బ్యూటీ

విశాల్ కు జోడీగా మరోసారి మిల్కీ బ్యూటీ

08-11-2018

విశాల్ కు జోడీగా మరోసారి మిల్కీ బ్యూటీ

యాక్షన్‌ హీరో విశాల్‌, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్‌ సి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ట్రైడెండ్‌ ఆర్ట్స్‌ నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుందని తెలిసింది. ఇక విశాల్‌, తమన్నా ఇంతకుముందు సూరజ్‌ తెరకెక్కించిన కత్తినందై చిత్రంలో జోడీగా నటించారు కూడ.. ప్రస్తుతం విశాల్‌ టెంపర్‌ తమిళ రీమేక్‌లో నటిస్తున్నారు. సుందర్‌ సి శింబుతో అత్తారింటికి దారేది రీమేక్‌ చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తిచేసిన తర్వాత ఈ కొత్త చిత్రం సెట్స్‌ మీదకు వెళ్లనుందని తెలిసింది.