పేలేవన్నీ మాసు...వెలిగేవన్నీ క్లాసు

పేలేవన్నీ మాసు...వెలిగేవన్నీ క్లాసు

08-11-2018

పేలేవన్నీ మాసు...వెలిగేవన్నీ క్లాసు

సినిమాల్లోనే కాదు, దీపావళి టపాసుల్లో కూడా కాస్లు మాసూ ఉంటాయి. పేలేవన్నీ మాసు. వెలిగేవన్నీ క్లాసు. అలా ఓ మతాబులా వెలిగిపోయిన కథానాయిక సమంత. రంగస్థలంలో రామలక్ష్మిగా ఆకట్టుకున్న సమంత ఆ తరవాత చేసిన రెండూ క్లాసీ టచ్‌ ఉన్న పాత్రలే. యూటర్న్‌ కోసం తొలిసారి కథానాయిక ప్రాధాన్యం ఉన్న కథని ఎంచుకుంది. మహానటి లో పాత్రికేయురాలిగా నటించింది. ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి ఓ చిత్రంలో నటిస్తోంది. పెళ్లయ్యాక తన గేరు మార్చి, జోరు పెంచిన సమంత ప్రస్తుతం తమిళ సీమపైనా దృష్టి పెట్టింది.