సరోజాదేవి పాత్రలో అనుష్క ?

సరోజాదేవి పాత్రలో అనుష్క ?

08-11-2018

సరోజాదేవి  పాత్రలో అనుష్క ?

క్రిష్‌ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రగా తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్‌ బయోపిక్‌ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఆ రోజుల్లో ఎన్టీఆర్‌ సరసన పలుచిత్రాల్లో నటించి మెప్పించిన ఓ మాజీ ప్రముఖ హీరోయిన్‌ పాత్రలో అనుష్క నటించనుంది. బి.సరోజా పాత్రలో అనుష్క నటించనుంది. అప్పట్లో ఎన్టీఆర్‌ సరసన సరోజాదేవి చాలా సినిమాల్లో నటించారు. అందులో చాలా చిత్రాలు సూపర్‌హిట్‌ అయ్యాయి. ఆ చిత్రాలకు సంబంధించిన షూటింగ్‌ సంఘటనలను ఈ బయోపిక్‌లో చూపించనున్నారు. త్వరలో జరగబోయే షెడ్యూల్‌లోనే అనుష్కశెట్టి చిత్ర బృందం ఆ సన్నివేశాల తాలూకు సీన్స్‌ను చిత్రీకరించనున్నారు.