పెళ్లిపీటలెక్కనున్న మాజీ విశ్వసుందరి?

పెళ్లిపీటలెక్కనున్న మాజీ విశ్వసుందరి?

08-11-2018

పెళ్లిపీటలెక్కనున్న మాజీ విశ్వసుందరి?

మాజీ విశ్వసుందరి, బాలీవుడ్‌ నటి సుస్మితా సేన్‌ పెళ్లి పీటలెక్కబోతున్నారా? అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. కొంతకాలంగా సుస్మిత రోహ్‌మన్‌ షాల్‌ అనే మోడల్‌తో డేటింగ్‌లో ఉన్నారు. తనతో ప్రేమలో ఉన్నట్లు సుస్మిత ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రకటించారు. కొన్నివారాల క్రితమే పెళ్లి చేసుకుందామని రోహ్‌మన్‌.. సుస్మితను అడిగారట. ఇందుకు సుస్మిత కూడా ఒప్పుకోవడంతో ఇద్దరూ వివాహ బంధంతో ఒకటి కానున్నట్లు తెలుస్తోంది.