రహస్యం ట్రైలర్ నాకు బాగా నచ్చింది

రహస్యం ట్రైలర్ నాకు బాగా నచ్చింది

09-11-2018

రహస్యం ట్రైలర్ నాకు బాగా నచ్చింది

వంద చిత్రాలకు చేరువలో ఉన్న భీమవరం టాకీస్‌ బ్యానర్‌లో వస్తోన్న మరో హార్రర్‌ చిత్రం రహస్యం. ఇటీవలే ఫస్ట్‌లుక్‌, థియేట్రికల్‌ ట్రైలర్‌ను వినాయక్‌, రాంగోపాల్‌ వర్మ, పూరి జగన్నాథ్‌ విడుదల చేశారు. దీపావళిను పురస్కరించుని దర్శకుడు మారుతి మరో ట్రైలర్‌ను ఆవిష్కరించారు. మారుతి మాట్లాడుతూ సినిమాల మీద అభిరుచి ఉన్న నిర్మాత రామసత్యనారాయణ. చిన్న సినిమాలుని తీసి విజయవంతంగా విడుదల చేయడంలో అతనికి అతనే సాటి. డైరెక్టర్‌ స్టయిలిష్‌గా చేశాడు. ట్రైలర్‌ నాకు బాగా నచ్చిందని తెలిపారు. చిత్ర నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ దర్శకుడు సాగర్‌ శైలేష్‌ తన శక్తి, యుక్తిని పణంగా పెట్టి ఈ సినిమా తీసాడు. కథలో ట్విస్ట్‌లు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయని అన్నారు.