మాస్ హీరోతో సన్నీ చిందులు

మాస్ హీరోతో సన్నీ చిందులు

17-11-2018

మాస్ హీరోతో సన్నీ చిందులు

ఎన్టీఆర్‌-పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన టెంపర్‌ బాక్సాఫీస్‌ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా విడుదలైన చాలా ఏళ్ల తర్వాత హిందీలో రణ్‌వీర్‌సింగ్‌ హీరోగా సింబా పేరుతోనూ, తమిళంలో విశాల్‌ హీరోగా అయోగ్య పేరుతోనూ తెరకెక్కడం విశేషం. తమిళ రిమేక్‌కు ఎఆర్‌ మురుగదాస్‌ శిష్యుడు వెంకట్‌ మోహన్‌ దర్శకుడు. విశాల్‌ కోసం దర్శకుడు ఒక పవర్‌పుల్‌ మాస్‌ ఐటెం నెంబర్‌ ప్లాన్‌ చేశాడట. అందుకోసం హాట్‌ బ్యూటీ సన్నీలియోన్‌ని సంప్రదించడం, వెంటనే ఆమె ఓకె చెప్పడం జరిగిపోయాయట. ఈ సినిమాలో రాఖీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇతర కీలక పాత్రలలో పార్తీబన్‌, దర్శకుడు కెఎస్‌ రవికుమార్‌ నటిస్తున్నారు. చిత్రానికి శ్యామ్‌ సిఎస్‌ సంగీత దర్శకుడు, తమిళ సంక్రాంతికి సినిమా విడుదల చేయనున్నట్టు సమచారం.