96కు అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్

96కు అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్

17-11-2018

96కు అల్లు అర్జున్  గ్రీన్ సిగ్నల్

విజయ్‌ సేతుపతి, త్రిషా జంటగా రూపొందిన తమిళ చిత్రం 96 విమర్శకుల ప్రశంసలతో చక్కటి వసూల్లను రాబట్టింది. 1996లో పదో తరగతి చదువుతున్న సమయంలో ప్రేమలో పడిన ఓ జంట ఇరవై ఏళ్ల తర్వాత ఎలా కలుసుకున్నారు? ఈ ప్రయాణంలో వారి మధ్య చోటుచేసుకున్న భావోద్వేగాల నేపథ్యంలో హృద్యమైన ప్రేమకథగా దర్శకుడు ప్రేమ్‌కుమార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించనున్నట్లు సమాచారం. కథలోని వైవిధ్యత నచ్చడంతో ఆయన ఈ రీమేక్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మాతృకకు దర్శకత్వం వహించిన ప్రేమ్‌కుమార్‌ తెలుగు రీమేక్‌ను తెరకెక్కించబోతున్నట్లు తెలిసింది. తెలుగు నేటివిటికీ అనుగుణంగా ప్రస్తుతం దర్శకుడు కథలో మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలిసిది. దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం.