నేనేమీ ప్లాన్ చేసుకోను...ఫ్లో ఎలా ఉంటే అలా వెళ్లిపోతా

నేనేమీ ప్లాన్ చేసుకోను...ఫ్లో ఎలా ఉంటే అలా వెళ్లిపోతా

04-12-2018

నేనేమీ ప్లాన్ చేసుకోను...ఫ్లో ఎలా ఉంటే అలా వెళ్లిపోతా

స్పైడర్‌ తర్వాత రకుల్‌కు తెలుగులో కొంత గ్యాప్‌ వచ్చింది. అటు తమిళంలో రెండుమూడు సినిమాలు చేతిలో ఉన్నప్పటికీ ఇక రకుల్‌ పనైపోయింది. అవకాశాలు అంతకంతే అన్న మాటలు ఫిల్మ్‌నగర్‌ సర్కిల్‌లో వినిపించాయి. అయితే పడిలేచినట్టుగా ఒక్కసారిగా రకుల్‌ అవకాశాలు అందుకొంది. తెలుగులో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న యన్‌.టి.ఆర్‌ బయోపిక్‌లో శ్రీదేవి పాత్ర పోషించే అవకాశంతో పాటు బాబీ దర్శకత్వం వహిస్తున్న వెంకీమామ లో నాగచైతన్య సరసన అవకాశం అందుకొంది. అలాగే తమిళ, హిందీ చిత్రాలతో కూడా బిజీగా ఉంది. మూడు బాషల్లో సినిమాలు చేస్తూ టైమ్‌ను ఎలా బ్యాలెన్స్‌ చేస్తున్నారు అని రకుల్‌ను అడిగితే నేనేమీ ప్లాన్‌ చేసుకోను. ఫ్లో ఎలా ఉంటే అలా వెళ్లిపోతా. ఒకేసారి రెండు మూడు సెట్‌లలో పనిచేయడం కాస్త సవాల్‌తో కూడిన పనే. సాధించాలనే తపన ఎంత దూరమైన తీసుకెళ్తుంది. ఇలాంటి సవాళ్లను అధిగమించేలా చేస్తుంది అని తెలిపింది.