అంగరంగ వైభవంగా ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ ల వివాహం

అంగరంగ వైభవంగా ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ ల వివాహం

04-12-2018

అంగరంగ వైభవంగా ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ ల వివాహం

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా, అమెరికన్‌ సింగర్‌ నిక్‌ జోనాస్‌ల వివాహం వైభవంగా జరిగింది. రాజస్థాన్‌లోని చారిత్రాత్మకమైన ఉమైద్‌ ప్యాలెస్‌లో ఈ వివాహ వేడుక కన్నులపండువగా జరిగింది. హిందూ క్రిస్టియన్‌ పద్దతుల్లో రెండు సార్లు జరిగిన ఈ వివాహ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇక పెళ్లికి ముందు ప్రియాంక, నిక్‌ల సంగీత్‌ కార్యక్రమం అదరహో అన్నట్లుగా సాగింది. ఒక పెద్ద అవార్డుల వేడుక లేదా సినీ వేడుక జరిగినట్లుగా డ్యాన్సులు, పాటలతో ఆద్యంతం హుషారుగా సాగింది ఈ కార్యక్రమం. ప్రియాంక, నిక్‌లు ఉత్సాహంగా డ్యాన్సులు చేసి ఆహుతులను అలరించారు. పలు హిందీ సాంగ్స్‌కు నిక్‌ డ్యాన్సులు చేసి ఆకట్టుకున్నాడు. ఇక ప్రియాంక చోప్రా, ఆమె తల్లి మధు చోప్రాలు కలిసి ఒక పాటకు డ్యాన్స్‌ చేసిన సమయంలో ఆడిటోరియంలో ఉన్న వారు అంతా కేకలు వేసి ప్రోత్సహించారు. నిక్‌ పాడిన కొన్ని పాటలకు ప్రియాంక స్టెప్పులు వేసి మైమరపించింది. పెళ్లి తంతు ముగియడంతో త్వరలో ముంబయిల్‌లో భారీ ఎత్తున రిసెప్షన్‌కు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.