జెనీలియా రీ ఎంట్రీ

జెనీలియా రీ ఎంట్రీ

04-12-2018

జెనీలియా రీ ఎంట్రీ

రితేష్‌ దేశ్‌ముఖ్‌, జెనీలియా భార్యభర్తలు. వివాహానికి ముందు వీరిద్దరూ కలసి హీరో హీరోయిన్లుగా నటించారు. ఆ తర్వాత జెనీలియా సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది. అదీ తన భర్త రితేష్‌ దేశ్‌ముఖ్‌ హీరోగా నటిస్తున్న చిత్రంతోనే. వీరిద్దరి కాంబినేషన్‌లో మౌళి అనే  మరాఠి చిత్రం రూపొందింది. అందులో రూపొందించిన హోలీ పండుగ గీతాన్ని విడుదల చేశారు. ఈ చిత్రానికి ఆదిత్యా సర్పోట్‌డర్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను ఇప్పటికే విడుదల చేశారు. దానికి మంచి స్పందన కూడా వచ్చిందని ఈ సందర్భంగా దర్శకుడు తెలిపారు. ఈ ఏడాదిలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. రితేష్‌ ఈ చిత్రంలో మరాఠి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అజయ్‌ ఆతుల్‌ బాణీలు సమకూరుస్తున్నాడు. జియో స్టూడియోస్‌, ముంబాయి ఫిల్మ్‌ కంపెనీ, హిందుస్తాన్‌ టాకీస్‌ బ్యానర్లపై రూపొందుతోంది. డిసెంబర్‌ 14వ తేదీన విడుదల చేయనున్నారు.