భారతీయుడు జోడీగా చందమామ

భారతీయుడు జోడీగా చందమామ

04-12-2018

భారతీయుడు జోడీగా చందమామ

కమల్‌ హాసన్‌, 2.0 దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రం భారతీయుడు 2. ఇది భారతీయుడు కు సీక్వెల్‌గా రానుంది. ఈ చిత్రంలో కమల్‌కు కథానాయికగా మన తెలుగు చందమామ.. అదేనండి కాజల్‌ అగర్వాల్‌ చేయనుంది. మొదట ఈ సినిమాలో నటిస్తారని చాలా మంది హీరోయిన్లు పేరు బయటకొచ్చాయి. కానీ చివరకు కాజల్‌ను ఎంపిక చేశారు. ఈ  విషయాన్ని అధికారికంగా ఆ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో వెల్లడించింది. ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని ఇటీవల నిర్వహించారు. రెగ్యులర్‌ షూటింగ్‌ను డిసెంబర్‌ 14న హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారు. రెండో షెడ్యూల్‌ చెన్నైలో జరగనుంది.