బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ ట్రైలర్ ని విడుదల చేసిన ఎన్.శంకర్

బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ ట్రైలర్ ని విడుదల చేసిన ఎన్.శంకర్

04-12-2018

బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ ట్రైలర్ ని విడుదల చేసిన ఎన్.శంకర్

మాగంటి శ్రీనాథ్‌, సాన్వీ మేఘనా జంటగా నటించిన చిత్రం బిలాల్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌. గోరేటి వెంకన్న కీలక పాత్ర పోషించారు. నాగసాయి మాకం దర్శకుడు. మహంకాళి శ్రీనివాస్‌ నిర్మాత. హైదరాబాద్‌లో ప్రముఖ దర్శకుడు ఎన్‌.శంకర్‌ ట్రైలర్‌ని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాస్తవ కథలతో సినిమాలు నిర్మించాలంటే ధైర్యం కావాలి. నిర్మాత ఎంతో ఇష్టం, ధైర్యంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. తెలంగాణ పల్లెల్లోని వాతావరణం ఈ చిత్రంలో కనిపిస్తోందన్నారు. నిర్మాత మాట్లాడుతూ జీవితాల్లో నుంచి పుట్టిన కథ ఇది. వాణిజ్య హంగులతో సహజత్వం ఉట్టిపడేలా నిర్మించాం. ఈ నెల రెండో వారంలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అన్నారు. ఒక ఊరి పోలీస్‌ స్టేషన్‌కి ఎలాంటి వింత కేసులు వచ్చాయన్నది తెరపైనే చూడాలి. నవ్విస్తూ ఆలోచింపజేస్తుందీ చిత్రం అన్నారు దర్శకుడు.