కమల్ హాసన్ అభిమానులకు ఓ షాక్

కమల్ హాసన్ అభిమానులకు ఓ షాక్

05-12-2018

కమల్ హాసన్ అభిమానులకు ఓ షాక్

విశ్వనటుడు కమల్‌హాసన్‌ రాజకీయ పార్టీ స్థాపించి 2019 ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. పార్టీ పనులతో బిజీగా గడుపుతున్న ఆయన ఈ ఏడాది ఫిబ్రవరిలో సినిమాలకు ఇక పుల్‌స్టాప్‌ పెట్టేస్తానని ప్రకటించారు. అయితే మధ్యలో పెండింగ్‌లో ఉన్న విశ్వరూపం 2ను విడుదల చేశారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో శభాష్‌ నాయుడు సినిమా తెరకెక్కించారు. అయితే అది ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఇటీవల శంకర్‌ దర్శకత్వంలో భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా భారతీయుడు 2 ప్రారంభించారు. శంకర్‌ సినిమాల తరహాలో ఉంటూనే రాజకీయ కోణం కూడా అందులో ఉంటుందనీ, తన రాజకీయ పార్టీకు సంబంధించిన వ్యూహాలను భారతీయుడు 2లో ప్రస్తావిస్తానని కమల్‌ ఇటీవల తెలిపారు. ఉన్నట్లుండి ఆయన అభిమానులకు ఓ షాక్‌ ఇచ్చారు. భారతీయుడు 2 తన చివరి చిత్రమనీ, ఆ తర్వాత రిటైర్‌ అవుతానని ఆయన ఓ ఇంటర్వ్యూంలో చెప్పారు. 2019 ఎన్నికల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.