మహావీర్ కర్ణ ఆరంభం

మహావీర్ కర్ణ ఆరంభం

05-12-2018

మహావీర్ కర్ణ ఆరంభం

తమిళ స్టార్‌ హీరో చియాన్‌ విక్రమ్‌ నటించనున్న భారీ బడ్జెట్‌ చిత్రం మహావీర్‌ కర్ణ. కార్తీక సోమవారం నాడు కేరళలో లాంఛనంగా ప్రారంభమైంది. సుమారు 300 కోట్ల బడ్జెట్‌తో న్యూయార్క్‌ బేస్డ్‌ నిర్మాణ సంస్థ అయిన యునైటెడ్‌ ఫిలింకింగ్‌డమ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్‌ కర్ణుడి పాత్రలో కనిపించనున్నారు. భీముడు పాత్ర కోసం పలువురు హాలీవుడ్‌ నటుల్ని సంప్రదిస్తున్నారు. మహాభారతం ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఆర్‌ఎస్‌.విమల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతుండగా మిగితా భాషల్లోకి అనువాదం కానుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది డిసెంబర్‌లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.