హీరో విశాల్ ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా?

హీరో విశాల్ ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా?

10-01-2019

హీరో విశాల్ ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా?

హీరో విశాల్‌ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా అతని తండ్రి జీకే రెడ్డి వెల్లడించారు. తాజాగా విశాల్‌ తను వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నట్లు సృష్టం చేశారు. అది పెద్దలు కుదిర్చిన వివాహం కాదని, ప్రేమ వివాహమని విశాల్‌ తెలిపారు. త్వరలోనే ఎంగేజ్‌మెంట్‌ కూడా జరగనుందని విశాల్‌ తెలిపాడు. ఇరువైపు పెద్దలూ త్వరలోనే కలుసుకుని ఎంగేజ్‌మెంట్‌కు డేట్‌ ఫిక్స్‌ చేస్తారని సమాచారం. ఇకపోతే విశాల్‌ చేసుకోబోయే అమ్మాయి పేరు అనీషా. హైదరాబాద్‌కి చెందిన విజయ రెడ్డి, పద్మజ దంపతులు ముద్దుల కుమార్తె. విజయ్‌ రెడ్డి బిజినెస్‌ చేస్తున్నారు. విశాల్‌ నడిగర్‌ సంఘం కొత్త భవనం పూర్తయ్యాకే పెళ్లి చేసుకుంటానని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అనీషా, విశాల్‌ ఎంగేజ్‌మెంట్‌ మాత్రం త్వరలోనే జరగనుంది. అప్పుడే పెళ్లి డేట్‌ కూడా ప్రకటించనున్నారు.