ప్రభాస్-పూజా హెగ్డే చిత్రానికి టైటిల్ ఖరారు!

ప్రభాస్-పూజా హెగ్డే చిత్రానికి టైటిల్ ఖరారు!

10-01-2019

ప్రభాస్-పూజా హెగ్డే చిత్రానికి టైటిల్ ఖరారు!

బాహుబలి చిత్రం ప్రభాస్‌ రేంజ్‌ దేశ వ్యాప్తంగా పాకేలా చేసింది. గత ఏడాది ప్రభాస్‌ నటించిన ఓ ఒక్క చిత్రం కూడా విడుదల కాకపోవడంతో అభిమానులు నిరాశలో ఉన్నారు. అయితే ఈ ఏడాది మాత్రం రెండు అదిరిపోయే చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు డార్లింగ్‌. సుజీత్‌ దర్శకత్వంలో సాహో అనే ప్రాజెక్ట్‌ చేస్తున్నాడు ప్రభాస్‌. ఈ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. శ్రద్దా కపూర్‌ ఇందులో కథానాయికగా నటిస్తుంది. ఈ ఏడాది సమ్మర్‌లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో వైపు తన 20వ చిత్రంగా కె కె రాధా కృష్ణ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారడు. ఈ చిత్రాన్ని గోపికృష్ణ మూవీస్‌, యువీ క్రియేషన్‌స సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే కథనాయికగా నటిస్తున్న ఈ చిత్రం 1970 బ్యాక్‌ డ్రాప్‌ నేపథ్యంలో రూపొందుతున్నట్టు సమాచారం. చిత్రానికి జాన్‌ అనే టైటిల్‌ని కన్‌ఫాం చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం క్లైమాక్స్‌ కి సంబంధించిన షూటింగ్‌ జరుగుతుండగా, అతి త్వరలోనే చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ విడుదల చేయనున్నారని అంటున్నారు.