ప్రధాన మంత్రిగా మోహన్ లాల్ ?

ప్రధాన మంత్రిగా మోహన్ లాల్ ?

11-01-2019

ప్రధాన మంత్రిగా మోహన్ లాల్ ?

సూర్య హీరోగా కె.వి.ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న కప్పాన్‌ చిత్రం ఇటీవల రెండు షెడ్యూల్స్‌ పూర్తిచేసుకుంది. ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్‌కు అనూహ్యమైన స్పందన రావడంతో సినిమాపై అంచనాలు జోరందుకున్నాయి. ఈ చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌ లాల్‌ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఆయన ప్రధాని మోదీగా కనిపిస్తారని సమాచారం. ఆయన సెక్యూరిటీ అధికారిగా సూర్య నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రం సమ్మర్‌లో విడుదల చేయనున్నారు. సూర్య సరసన సయేషా సైగల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కే ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 14న విడుదల చేస్తారట.