ప్రేమికుల రోజు లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్

ప్రేమికుల రోజు లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్

11-02-2019

ప్రేమికుల రోజు లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్

ఎన్టీఆర్‌ జీవిత కథతో తెరకెక్కుతున్న మరో సినిమా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌. రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. రాకేష్‌ రెడ్డి నిర్మాత. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్‌ జీవితంలోకి అడుగుపెట్టిన అనంతర ఘనటలు చూపించనుంది. ఈ సినిమా ట్రైలర్‌ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేయబోతున్నారు వర్మ. ఇది కుటుంబ కుట్రల చిత్రం అంటూ సామాజిక మాధ్యమాలలో రామ్‌ గోపాల్‌ వర్మ చేస్తున్న పోస్టులు ఆసక్తి కలిగిస్తున్నాయి. రాజశేఖర్‌ అన్నిగి, యజ్ఞశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రమ్మీ, సంగీతం: కళ్యాణ్‌ కోడూరి, కొరియోగ్రఫీ : శంకర్‌ మాస్టర్‌, సాహిత్యం: సిరా శ్రీ, ఎడిటర్‌: కమల్‌ ఆర్‌, కాస్ట్యుమ్స్‌ : వెంకటేష్‌ జక్కుల, నిర్మాతలు: రాకేష్‌ రెడ్డి, దీప్తి బాలగిరి, దర్శకత్వం: ఆర్జీవీ, అగస్త్య మంజు