బోస్టన్‌ హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ నుంచి ఆహ్వానం

బోస్టన్‌ హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ నుంచి ఆహ్వానం

11-02-2019

బోస్టన్‌ హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ నుంచి ఆహ్వానం

బాలీవుడ్‌ నటి తనుశ్రీదత్తాకు బోస్టన్‌ హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ నుంచి ఆహ్వానం అందింది. హార్న్‌ ఓకే ప్లీజ్‌ చిత్రం సమయంలో నానా పటేకర్‌ తన పట్ల అనుచితంగా ప్రవర్తించిన విషయాన్ని గతేడాది తనుశ్రీదత్తా బయటపెట్టారు. బాలీవుడ్‌లో మీటూ ఉద్యమానికి ఈ ఘటనతో మరింత ఊపు వచ్చింది. ఆ తర్వాత ఆమె మరలా యూఎస్‌కు వెళ్లి స్థిరపడ్డారు. తాజాగా తనకు అందిన ఆహ్వానం గురించి తనుశ్రీదత్త ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఈ నెల 16న బోస్టన్‌లోని హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో ప్రసంగించమని ఆహ్వానించారు. హార్వర్డ్‌ కెన్నెడి స్కూల్‌, హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో గ్రాడ్యుయేట్‌ స్టూడెంట్స్‌ నిర్వహించే ఫ్లాగ్‌షిప్‌ ఈవెంట్‌లో ప్రసంగించమని ఆహ్వానించినందుకు ఆనందంగా ఉంది అని అన్నారు.