సంబరాలకు ఎన్టీఆర్‌ దూరం

సంబరాలకు ఎన్టీఆర్‌ దూరం

17-05-2019

సంబరాలకు ఎన్టీఆర్‌ దూరం

కథానాయకుల పుట్టినరోజు వస్తోందంటే అభిమానుల సంబరాలు అంబరాన్ని తాకుతుంటాయి. కొత్త చిత్రాల ముచ్చట్లు, టీజర్లు, ఫస్ట్‌లుక్కులూ వరుస కడుతుంటాయి. అందుకే స్టార్‌ కథానాయకుల పుట్టినరోజు కోసం చిత్రసీమ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటుంది. ఈ నెల 20న ఎన్టీఆర్‌ పుట్టిన రోజు. ప్రతిసారీ ఎన్టీఆర్‌ జన్మదిన వేడుకల్ని అభిమానులు ఘనంగా చేస్తుంటారు. అయితే ఈసారి వేడుకలకు దూరంగా ఉండాలని ఎన్టీఆర్‌ నిర్ణయించుకున్నారు. నందమూరి హరికృష్ణ 2018 ఆగస్టులో రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన దూరమై ఇంకా ఏడాది పూర్తి కాలేదు. అందుకే ఎన్టీఆర్‌ ఈసారి పుట్టిన రోజు జరుపుకోవట్లేదని సన్నిహితలు తెలిపారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ ఆర్‌ ఆర్‌ ఆర్‌లో నటిస్తున్నారు.