కేన్స్‌లో మెరిసిన తారలు

కేన్స్‌లో మెరిసిన తారలు

17-05-2019

కేన్స్‌లో మెరిసిన తారలు

ప్రతిష్ఠాత్మక 72వ కేన్స్‌ వేడుకల్లో బాలీవుడ్‌ అగ్ర కథనాయికలు దీపిక పదుకొణె, కంగనా రనౌత్‌, ప్రియాంక చోప్రా మెరిశారు. తెలుపు, నలుపు కాంబినేషన్‌ గౌనులో హై పోనీటెయిల్‌తో దీపిక చూడముచ్చటగా ముస్తాబయ్యారు. కంగనా రనౌత్‌ మాత్రం ఈసారి కాంజీవరం చీరను ఎంపిక చేసుకున్నారు. చేతికి పర్పుల్‌ రంగు గ్లౌజులు ధరించి విభిన్నమైన లుక్‌లో దర్శనమిచ్చారు. ఇక కేన్స్‌లో గ్లోబర్‌స్టార్‌ ప్రియాంక చోప్రా ఎర్ర తివాచీపై నడవడం ఇదే మొదటిసారి. ఆఫ్‌ షోల్డర్‌ గౌనులో సింపుల్‌గా ముస్తాబై హోయలొలికించారు. రెండు విభిన్నమైన దుస్తుల్లో ప్రియాంక పోజులిచ్చారు. అలా బాలీవుడ్‌ మహారాణులు ఒకే రోజు కేన్స్‌ వేడుకకు హాజరై చూపరులను ఆకట్టుకున్నారు.