24న నాగకన్య వస్తోంది

24న నాగకన్య వస్తోంది

18-05-2019

24న నాగకన్య వస్తోంది

జై, వరలక్ష్మి శరత్‌కుమార్‌, రాయ్‌లక్ష్మి, కేథరిన్‌ ప్రధాన పాత్రధారులుగా ఎల్‌. సురేష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం నాగకన్న. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారు. లైట్‌హౌస్‌ సినీ మ్యాజిక్‌ పతాకంపై నిర్మాత కె.ఎస్‌. శంకర్‌రావు  ఈ నెల 24న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. దర్శకుడు  మాట్లాడుతూ ఈ కథలో నాగకన్న ఎవరన్నది ఆసక్తికరం. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేస్తూ రూపొందించాం. కింగ్‌ కోబ్రా నేపథ్యంలో సన్నివేశాలు ఆకట్టుకుంటాయి అన్నారు. నిర్మాత మాట్లాడుతూ పాము నేపథ్యంతో వచ్చిన నోము, దేవి, పున్నమినాగు, అమ్మా నాగమ్మ తదితర చిత్రాలు ప్రేక్షకాదరణకి నోచుకున్నాయి. ఆ తరహా కథతోనే రూపొందించిన చిత్రమిది. హారర్‌ కథతో పాటు, ఆకట్టుకొనే నలభై నిమిషాల విజువల్‌ ఎఫెక్ట్స్‌ సన్నివేశాలు కీలకం. ప్రచార చిత్రాలకి మంచి స్పందన లభించింది అన్నారు.