మహేష్ బాబుకు మరో శుభవార్త

మహేష్ బాబుకు మరో శుభవార్త

18-05-2019

మహేష్ బాబుకు మరో శుభవార్త

మహర్షి విజయోత్సవాన్ని జరుపుకుంటున్న మహేష్‌ బాబుకు మరో శుభవార్త తెలిసింది. ప్రతిష్టాత్మక టైమ్‌ మేగజైన్‌ ఏటా ప్రకటించే మోస్ట్‌ డిజైరబుల్‌ ఫర్‌ ఎవర్‌ జాతితాలో ఈ సూపర్‌స్టార్‌కు చోటు ఇచ్చింది. దక్షిణాది చిత్ర పరిశ్రలో ఈ ఘనత అందుకున్న ఒకే ఒక నటుడు మహేష్‌ బాబు కావడం విశేషం. బాలీవుడ్‌ నుంచి సల్మాణన్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌, అమీర్‌ ఖాన్‌ మాత్రమే టైమ్‌ మోస్ట్‌ డిజైరబుల్‌ ఫర్‌ ఎవర్‌ జాబితాలో చోటు దక్కించుకున్నారు. మేడమ్‌ టుస్సాడ్స్‌లో మ్యూజియంలో ప్రతిష్టించిన మైనపు ప్రతిమ తొలిసారి హైదరాబాద్‌లో ప్రదర్శనకు వచ్చింది. ఇలా ఒక స్టార్‌ ఉంటున్న ఊరికి అతని విగ్రహం ప్రదర్శనకు రావడం మేడమ్‌ టుస్సాడ్స్‌ చరిత్రలో తొలిసారి. ఇలాంటి ఘనతలు వరుసగా దక్కించుకుంటున్నారు మహేష్‌. తన ఇరవై ఏళ్ల కెరీర్‌లో పాతిక సినిమాలు పూర్తి చేశారు మహేష్‌. ఇరవై ఐదో సినిమా ఎంత గొప్పగా ఉండాలని భావించారో మహర్షి అంతే అద్భుత విజయాన్ని సాధించింది. వంద కోట్ల రూపాయల గ్రాసర్‌గా నిలిచింది. ఇప్పటిదాకా మహేష్‌ బాబు కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలను మహర్షి తొలివారమే దాటేడయం సూపర్‌స్టార్‌ అభిమానులను సంతోషంతో ఊపేస్తోంది.