మళ్లీ నటిగా చేయాలనే కోరిక లేదు

మళ్లీ నటిగా చేయాలనే కోరిక లేదు

18-05-2019

మళ్లీ నటిగా చేయాలనే కోరిక లేదు

హీరోయిన్‌గా ఎన్నోచిత్రాల్లో నటించి మెప్పించిన చార్మి ప్రస్తుతం పూరి బ్యానర్‌లో నిర్మాణం జరుపుకుంటున్న సినిమాల నిర్మాణ బాధ్యతలు చూసుకుంటోంది. తాజాగా చార్మి పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గతంలో తాను ఎదుర్కొన్న చీకటి జీవితం గురించి చెప్పు కొచ్చింది. టాలీవుడ్‌ షేక్‌ చేసిన డ్రగ్స్‌ కేసులో తన పేరు రావటంపై మొదటిసారి చార్మి స్పందించారు. ఈ కేసు తన జీవితంలోనే చెత్త సంఘటనగా చెప్పకొచ్చింది. డ్రగ్స్‌ కేసు గురించి చెబుతూ డ్రగ్స్‌ కేసులో తన పేరు ఎలా వచ్చిందో తెలియదు. ఆ సమయంలో నేను చాలా బాధపడ్డాను. నేను మాత్రమే కాదు తన కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందికి గురయ్యారు. అయితే వారికి నాపై పూర్తి నమ్మకం ఉంది. సినిమాల గురించి చార్మి స్పందిస్తూ నటిగా 15 ఏళ్లు చేసి బోర్‌ కోట్టింది. మళ్లీ నటిగా చేయాలనే కోరిక లేదు. ఇకపై నిర్మాత కొనసాగుతానంటూ చెప్పుకొచ్చింది.