బాలీవుడ్‌ నటుడికి అరుదైన గౌరవం

బాలీవుడ్‌ నటుడికి అరుదైన గౌరవం

18-05-2019

బాలీవుడ్‌ నటుడికి అరుదైన గౌరవం

బాలీవుడ్‌ హాస్య నటుడు కపిల్‌ శర్మ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఎక్కువ మంది ఫాలోయింగ్‌, ప్రేక్షకులను సంపాదించుకున్న స్టాండప్‌ కమెడియన్‌గా ఆయన ఘనత సాధించారు. ఇందుకు గానూ వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ లండన్‌ లో చోటు దక్కింది. సందర్భానుసారం ఆయన మాట్లాడే తీరు, పంచ్‌లకు బాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్‌ ఉంది. దీంతో పాటు ఆయన ది కపిల్‌ శర్మ షో పేరుతో ఓ కార్యక్రమాన్ని వ్యాఖ్యాతగానూ వ్యవహిరిస్తున్నారు. ఈ షో విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఇండియాతో పాటు ఆయనకు విదేశాల్లోనూ అభిమానులున్నారు. కపిల్‌ను అభిమానులు ముద్దుగా కామెడీ కింగ్‌ అని కామెడీ సూపర్‌స్టార్‌ అని పిలుచుకుంటారు.