సినిమా కథలు పుస్తకావిష్కరణ

సినిమా కథలు పుస్తకావిష్కరణ

20-05-2019

సినిమా కథలు పుస్తకావిష్కరణ

రచయిత వెంకట్‌ సిధారెడ్డి రచించిన సినిమా కథలు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో విజయ్‌ దేవరకొండ, దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌, నిర్మాత సురేష్‌ బాబు, నటుడు ప్రియదర్శి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రచయిత వెంకట్‌ సిధారెడ్డి మాట్లాడుతూ పుస్తక విక్రయం చాలా కష్టమైంది. ఒక స్నేహితుడు వెయ్యి కాపీల తెలుగు సాహిత్యం అమ్మగలవా అని అడిగారు. మంచి సాహిత్యానికి ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ఆ నమ్మకంతోనే సినిమా కథలు పుస్తకాన్ని రచించాను. నా ప్రయత్నానికి తోడుగా ఉన్న స్నేహితులకు కృతజ్ఞతలు అన్నారు. విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో పుస్తకాల పాత్ర ఎంతో ఉంది. అనేక పుస్తకాలు చదివాను. నా స్నేహితులకు మంచి పుస్తకాలను సూచిస్తాను. సినిమా కథలు పుస్తకం కూడా పాఠకాదరణ పొందాలని కోరుకుంటున్నాను అన్నారు.